1. హోమ్
  2. కూర్పులు
  3. అల్ అఖీద

హదీస్ అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”

عَن عَبدِ الله بنِ الشِّخِّير رضي الله عنه قَالَ:
انْطَلَقْتُ في وَفدِ بَنِي عَامِرٍ إِلى رَسُولِ الله صلى الله عليه وسلم، فَقُلنا: أَنتَ سيّدُنَا، فقال: «السَّيدُ اللهُ»، قُلنا: وَأَفْضَلُنا فَضْلاً، وأعظَمُنا طَوْلاً، فقال: «قُولُوا بِقَولِكُم، أَو بَعضِ قولِكُم، وَلَا يَسْتَجْرِيَنَّكُم الشَّيطَانُ».

అబ్దుల్లాహ్ ఇబ్న్ అష్’షిఖ్'ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను బనూ ఆమిర్ తెగ ప్రతినిధి బృందముతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలవడానికి బయలుదేరి వెళ్ళాను. అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”

ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అబీదావూద్ - 4806

వివరణ

కొంతమంది వ్యక్తుల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినది. వారు ఆయన దగ్గరికి వెళ్ళినపుడు వారు ఆయనను ప్రస్తుతించారు. వాటిలో కొన్ని మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడలేదు. వారు ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా!) నీవు మా నాయకుడవు, సార్వభౌముడవు” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “(కేవలం) అల్లాహ్ మాత్రమే సార్వభౌముడు” ఆయన తన సృష్టి మొత్తముపై సంపూర్ణ సార్వభౌమత్వము గలవాడు. వారందరూ ఆయన దాసులు. దానికి వారు ఇలా అన్నారు: “నీవు ఘనతలో మా అందరిలో ఉత్తముడవు; స్థానములో, గౌరవములో మరియు వైశిష్ట్యములో మా అందరిలో అత్యుత్తముడవు.” “నీవు మహనీయతలో సమున్నతమైనవాడవు, మా అందరిలో ఔదార్యములో, విశిష్టతలో, స్థానములో ఉత్తముడవు.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తాము సాధారణంగా మాట్లాడుకునే విధంగానే మాట్లాడమని, ప్రయాసపడి గొప్పగొప్ప మాటలు పలుక రాదని; ఉన్న దానిని ఎక్కువ చేసి చెప్పుట, ముఖస్తుతి చేయుట వలన షైతాను వలలో పడరాదని, అది (ఇస్లాం లో) నిషిద్ధమైన బహుదైవారాధనకు, మరియు దానికి చేరువచేసే సాధనాలకు దారి తీస్తుందని - వారికి మార్గదర్శకం చేసారు.

من فوائد الحديث

  1. ఈ హదీసు ద్వారా – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహబాల మనసులలో వారి అత్యున్నతమైన గౌరవం, వారి పట్ల మర్యాద తెలుస్తున్నాయి.
  2. అలాగే ఇందులో డాంబికముగా మాట్లాడుట నిషేధమని, మితముగా మాట్లాడాలని ఉద్బోధ ఉన్నది.
  3. ఇందులోని విషయం - తౌహీదును (ఏకదైవారాధనను) ఉల్లంఘించే మాటలను మరియు ఆచరణలను నిషేధించి తద్వారా తౌహీదును పరిరక్షించాలి.
  4. ఎవరినైనా ప్రస్తుతించుటలో హద్దులు మీరుట నిషేధము, అది షైతాను ప్రవేశించే మార్గాలలో ఒకటి.
  5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదము సంతానానికి నాయకుడు, సార్వభౌముడు. హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను గురించి ఆ విధంగా అనడాన్ని వారించడం అది వారి అణకువ, వినయం కారణంగానే.

అనువాదాలను వీక్షించండి

59 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
IT Italiano ఇటాలియన్
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية