1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ مَا النَّجَاةُ؟ قَالَ: «امْلِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ».

ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు.

ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 2406

వివరణ

ఉఖబహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకము నందు మరియు పరలోకము నందును ఒక విశ్వాసి మోక్షము పొందే మార్గములు ఏమిటి అని ప్రశ్నించినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దానికి నీవు మూడు విషయాలు ఆచరించాలి”
“మొదటిది: చెడు విషయాలు మాట్లాడుట నుండి, కీడు కలిగించే విషయాలు పలుకుట నుండి నీ నాలుకను అదుపులో ఉంచుకో, (నీ నాలుకతో) మంచి తప్ప మరేమీ మాట్లాడకు.”
“రెండవది: నీ ఏకాంతములో అల్లాహ్’ను ఆరాధించుట కొరకు (ఎక్కువగా) ఇంటి పట్టునే ఉండు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు విధేయత చూపే కార్యాలలో నిన్ను నీవు నిమగ్నం చేసుకో; (ప్రాపంచిక) ప్రలోభాలనుండి, ఆకర్షణల నుండి నిన్ను నీవు వేరు చేసుకో”;
“మూడవది: నీవు చేసిన పాపాల పట్ల దుఃఖపడు, విచారపడు మరియు పశ్చాత్తాపపడు.”

من فوائد الحديث

  1. మోక్షము పొందగలిగే మార్గాలను గురించి తెలుసుకొనుట కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు (సహాబాలు) ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవారు.
  2. ఈ హదీథులో, ఈ లోకమునందు మరియు పరలోకమునందు మోక్షము పొందగలిగే మార్గాలను గురించిన ప్రకటన ఉన్నది.
  3. ఇందులో - ఇతరులకు మంచి చేయగలిగే స్థోమత, సామర్థ్యము లేనట్లయితే, లేదా తాను ఇతరులతో కలవడం కారణంగా తనకు తన ధర్మానికి హాని కలిగే అవకాశం ఉన్నట్లయితే, మనిషి తనను తాను ఇతర పనులలో నిమగ్నం చేసుకోవాలి అనే హితబోధ ఉన్నది.
  4. ప్రత్యేకించి సాంఘిక కల్లోల సమయాలలో, లేక సంక్షోభ సమయాలలో ఒక విశ్వాసి తన ఇంటిపై అన్నివిధాలా శ్రద్ధ చూపాలి అని ఇందులో సూచించబడుతున్నది, ఎందుకంటే అటువంటి సమయాలలో ఒక వ్యక్తి తన ధర్మాన్ని కాపాడుకునే మార్గాలలో ఇది ఒకటి.

అనువాదాలను వీక్షించండి

51 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية