1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది

عَنْ عَبْدِ اللهِ بنِ مَسعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«عَلَيْكُمْ بِالصِّدْقِ، فَإِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ، وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ صِدِّيقًا، وَإِيَّاكُمْ وَالْكَذِبَ، فَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ، وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبُ وَيَتَحَرَّى الْكَذِبَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ كَذَّابًا».

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ ముస్లిం - 2607

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలకమని ఆజ్ఞాపించారు మరియు దానికి కట్టుబడి ఉండటం నిరంతర సత్కార్యాలకు దారి తీస్తుంది అని తెలియజేసారు. నిలకడగా మంచిపనులు చేయడం అనేది చేసే వ్యక్తిని స్వర్గానికి చేరుస్తుంది మరియు అతను రహస్యంగానూ మరియు బహిరంగంగానూ సత్యాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి అత్యంత సత్యవంతునిగా ముద్ర వేయబడటానికి అర్హుడు అవుతాడు. ఇది సత్యసంధత యొక్క పరాకాష్ఠ. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుట పట్ల మరియు తప్పుడు మాటలు మాట్లాడుట పట్ల హెచ్చరించారు. ఎందుకంటే అది ధర్మం నుండి వైదొలగడానికి మరియు చెడు, అవినీతి మరియు పాపపు పనులకు పాల్బడడానికి దారి తీస్తుంది; చివరికి నరకాగ్నికి దారి తీస్తుంది. అతడు నిరంతరం అసత్యమునే పలుకుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు.

من فوائد الحديث

  1. నిజాయతీ అనేది ఒక గొప్ప లక్షణం, దీనిని నిరంతర సాధన మరియు పోరాటం ద్వారా పొందుతారు, ఎందుకంటే అలాంటి వ్యక్తి నిజాయితీనే కోరుకుంటాడు, నిజాయితీగా ఉండడాన్నే కోరుకుంటాడు, నిజాయితీ అతని స్వభావం మరియు అతని తత్వము అయ్యే వరకు అతని సాధన కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అతను అల్లాహ్ వద్ద నిజాయితీపరులలో మరియు ధర్మబద్ధులలో నమోదు చేయబడతాడు.
  2. అసత్యం పలకడం అనేది ఒక ఖండించదగిన మరియు నిందనీయమైన లక్షణం. దానిని కలిగిన వ్యక్తి, సుదీర్ఘ అభ్యాసం ద్వారా దానిని పొందుతాడు. చివరికి అది అతని లక్షణం మరియు స్వభావంగా మారుతుంది. అసత్యం అతని మాటలలో మరియు అతని చర్యలలో భాగమైపోతుంది. చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు
  3. సత్యసంధత అనేక విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. సత్యసంధత నాలుకతో సంబంధం కలిగి ఉంటుంది, అది అసత్యానికి వ్యతిరేకమై ఉంటుంది; సత్యసంధత సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటుంది, సంకల్పములో సత్యవంతంగా ఉండడం నిజాయితీని సూచిస్తుంది; మంచిని చేయాలనే సంకల్పము దాని పట్ల దృఢత్వానికి, నిబద్ధతకు దారి తీస్తుంది. ఆచరణలలో నిజాయితీ - ఇది తక్కువలో తక్కువగా వ్యక్తి యొక్క అంతర్గత మరియు బాహ్య స్వభావాలలో సరళతకు సత్యవంతంగా ఉండుటకు దారి తీస్తుంది; మరియు వివిధ పరిస్థితులలో సత్యవంతంగా ఉండడం – ఉదాహరణకు భయం, ఆశపడుట మొదలైన విషయాలలో సత్యవంతంగా, నిజాయితీగా ఉండడం. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో అతడు అత్యంత సత్యవంతుడు; వీటిలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్నవాడు సత్యవాది.

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية