1. హోమ్
  2. కూర్పులు
  3. ఫిఖ్ మరియు దాని నియమాలు

హదీస్ నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَلْحِقُوا الفَرَائِضَ بِأَهْلِهَا، فَمَا بَقِيَ فَلِأَوْلَى رَجُلٍ ذَكَرٍ».

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది.

ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు సహీహ్ అల్ బుఖారీ - 6737

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వ ఆస్తిని పంచేవారికి, సర్వోన్నతుడైన అల్లాహ్ కోరిన విధంగా, న్యాయమైన మరియు ధార్మికమైన పద్ధతిలో, దానికి అర్హులైన వారికి పంచాలని ఆజ్ఞాపిస్తున్నారు. అందువలన, నిర్ణీత వాటాలు (ఫురూద్) కలిగిన వారికి అల్లాహ్ గ్రంథంలో నిర్దేశించిన వారి వాటాలు ఇవ్వబడతాయి. అవి: రెండు-మూడు వంతులు (2\3), మూడవ వంతు (1\3), ఆరవ వంతు (1\6), సగం (1\2), నాలుగవ వంతు (1\4), మరియు ఎనిమిదవ వంతు (1\8). ఆ తర్వాత ఏది మిగిలి ఉన్నా, అది మరణించిన వ్యక్తికి అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్న పురుషులకు ఇవ్వబడుతుంది, మరియు వారిని 'అస్బా' (Residuaries) అని అంటారు.

من فوائد الحديث

  1. ఈ హదీథ్ ప్రవచనము వారసత్వ ఆస్తి పంపిణీలో ఒక ప్రాథమిక నియమంగా ఉంది.
  2. వారసత్వ విభజనలో మొదట ఫరాయిద్ హక్కుదారులతో (నిర్ణీత వాటాలు కలిగిన వారితో) ప్రారంభించాలి.
  3. ఫరాయిద్ వాటాలను ఇచ్చిన తరువాత మిగిలినది అస్బా (వారసత్వంలో మిగిలిన భాగాన్ని అందుకునే హక్కు కలిగి ఉన్న పురుష బంధువులకు) చెందుతుంది.
  4. దగ్గర బంధువులకు ప్రాధాన్యత ఇవ్వాలి, అందుకే తండ్రి వంటి సమీప బంధుత్వపు 'అస్బా' (మిగిలిన ఆస్తిని తీసుకునే బంధువు) ఉన్నప్పుడు, బాబాయి వంటి దూరపు బంధుత్వపు 'అస్బా' వారసత్వ ఆస్తి పొందడు.
  5. నిర్ణీత వారసత్వ వాటాలలో (ఫురూద్) ఆస్తి మొత్తం అయిపోతే, ('అంటే ఆస్తిలో ఏమీ మిగలకపోతే), అస్బాకు (మిగిలిన భాగాన్ని తీసుకునేవారికి) ఏమీ దక్కదు.

అనువాదాలను వీక్షించండి

49 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
UG ئۇيغۇرچە ఉయ్ఘర్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
SQ Shqip అల్బేనియన్
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
NE नेपाली النيبالية
YO Yorùbá Юрба
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
KN ಕನ್ನಡ Канада
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
KMR Kurmancî الكرمنجية