1. హోమ్
  2. కూర్పులు
  3. దావహ్ మరియు హసబహ్

హదీస్ “నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”

عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ مِنْ أَعْظَمِ الجِهَادِ كَلِمَةَ عَدْلٍ عِنْدَ سُلْطَانٍ جَائِرٍ».

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”

హసన్ హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: సునన్ అత్తిర్మిదీ - 2174

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ మార్గములో చేయు వివిధ రకాల జిహాదులలో, అత్యంత ఉత్తమమైనది, మరియు ప్రయోజనకరమైనది – అన్యాయానికి పాల్బడుతూ ఉండే, కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం – ఎందుకంటే పాలకుని ఎదుట ఆ విధంగా మాట్లాడే వ్యక్తి ‘మంచి చేయమని ఆదేశించండి, చెడును నిషేధించండి’ అనే షరియత్ యొక్క ఆదేశంపై అనుసరించినాడు గనుక; అది అటువంటి పాలకుని ఎదుట నిలబడి మాట్లాడడం అయినా, లేక అతనికి లేఖ ద్వారా తెలియజేయడం అయినా, చర్య ద్వారా అతని అవగతమయ్యేలా చేయడం అయినా – ప్రజలకు లాభాన్ని చేకూర్చే, హానిని నివారించేది ఏదైనా కావచ్చు.

من فوائد الحديث

  1. ‘మంచి చేయమని ఆదేశించడం, చెడును నివారించడం, నిషేధించడం’ కూడా జిహాదే అని తెలుస్తున్నది.
  2. పాలకునికి (న్యాయమైన, ధర్మబద్ధమైన) సలహా ఇవ్వడం గొప్ప జిహాద్ లో ఒకటి, కానీ అది జ్ఞానము, వివేకము మరియు నిశ్చయతతో కూడి ఉండాలి.
  3. అల్ ఖత్తాబీ ఇలా అన్నారు: ఇది ఉత్తమమైన జిహాద్’గా గుర్తించబడింది. ఎందుకంటే శత్రువుతో పోరాడేవాడు తాను గెలుస్తాడో లేక ఓడిపోతాడో తెలియక ఆశ మరియు భయం మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. కానీ అధికారం ఉన్నవాని చేతిలో ఇతడు నిశ్చయంగా ఓడిపోయే (ప్రాణాలు కోల్పోయే) అవకాశం ఉన్నది. కనుక అతని ముందు నిలబడి న్యాయంగా మాట్లాడడం, న్యాయం చేయమని ఆదేశించడం అంటే నిశ్చయంగా తనను తాను, మరియు తన ప్రాణలను వినాశనానికి గురి చేసుకోవడమే అవుతుంది. ఇందులో తన ప్రాణాలు నిశ్చయంగా పోయే ప్రమాదం ఉన్నది అని తెలిసీ, భయాన్ని అధిగమించి అతడు పాలకుని ఎదుట నిలబడతాడు. అందుకని ఇది జిహాద్’లలో ఉత్తమమైనదిగా పేర్కొనబడింది. ధర్మపండితులు ఇంకా ఇలా అన్నారు: ఇది ఉత్తమమైన జిహాద్’గా పేర్కొనబడింది, ఎందుకంటే పాలకుడు అతడి మాటను పరిగణనలోకి తీసుకుంటే, పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగవచ్చు మరియు లక్ష్యం కూడా సాధించబడుతుంది.

అనువాదాలను వీక్షించండి

52 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
MY မြန်မာ బర్మీస్
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية