1. హోమ్
  2. కూర్పులు
  3. సద్గుణాలు మరియు పద్దతులు

హదీస్ నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో

عَنْ عَبْدِ اللَّهِ بْنِ بُسْرٍ رَضِيَ اللَّهِ عَنْهُ قَالَ: أَتَى النَّبِيَّ رَجُلٌ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ! إِنَّ شَرَائِعَ الإِسْلَامِ قَدْ كَثُرَتْ عَلَيْنَا، فَبَابٌ نَتَمَسَّكُ بِهِ جَامِعٌ؟ قَالَ:
«لاَ يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ». وفي رواية: مِنْ حَدِيثِ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُ: آخِرُ مَا فَارَقْتُ عَلَيْهِ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ قُلْتُ: أَيُّ الأَعْمَالِ خَيْرٌ وَأَقْرَبُ إِلَى اللَّهِ؟ قَالَ: «أَنْ تَمُوتَ وَلِسَانُكَ رَطْبٌ مِنْ ذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ».

అబ్దుల్లాహ్ ఇబ్నె బుస్ర్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా అన్నాడు: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇస్లాం యొక్క నియమాలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము గట్టిగా పట్టుకోగలిగే ఒక సంక్షిప్త మార్గాన్ని తెలియజేయండి.' అప్పుడు ఆయన ఇలా అన్నారు:"
"నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో." ముఆద్ ఇబ్నె జబల్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన మరొక హదీథులో ఇలా ఉంది: "నేను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి చివరిగా వేరు అయినప్పుడు, నేను ఇలా అడిగాను: 'ఏ పని ఉత్తమమైనది మరియు అల్లాహ్ కు అత్యంత దగ్గరగా ఉంటుంది?' అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నీవు మరణించేటప్పుడు నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా ఉండడం.'"

ప్రామాణికమైన హదీథు అహ్మద్, అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు: అన్నవవీ నలభై హదీథులు - 50

వివరణ

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన శారీరక బలహీనత కారణంగా స్వచ్ఛంద ఆరాధనలు ఆచరించుట తనపై భారంగా మారిందని మొర పెట్టుకున్నాడు. తరువాత అతడు తాను అంటి పెట్టుకుని ఉండగలిగేలా, తద్వారా తనకు గొప్ప ప్రతిఫలం లభించేలా తనకు ఏదైనా ఒక తేలిక ఆచరణను బోధించమని అర్థించాడు.
కనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అన్ని సమయాలలో, మరియు అన్ని పరిస్థితులలో నిరంతరం సర్వోన్నతుడైన అల్లాహ్ ‘తస్బీహ్’ అంటే - (సుబ్’హానల్లాహ్ – అల్లాహ్ పరమ పవిత్రుడు); ‘తమ్’హీద్’ (అల్’ హందులిల్లాహ్ – స్తోత్రములన్నీ కేవలం అల్లాహ్ కొరకే); ‘ఇస్తిగ్’ఫార్’ (అస్తగ్’ఫిరుల్లాహ్ – ఓ అల్లాహ్ నన్ను క్షమించు); ‘దుఆ’ చేయుట; మరియు మొరపెట్టుకొనుట - ఈ విధంగా అల్లాహ్’ను కీర్తించడం, ప్రశంసించడం; క్షమాపణ కోరడం, ప్రార్థించడం మొదలైన వాటి ద్వారా తన నాలుకను నిరంతరం తాజాగా మరియు చురుకుగా ఉంచుకోమని సలహా ఇచ్చినారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో సర్వోన్నతుడైన అల్లాహ్’ను నిరంతరం స్మరించుట యొక్క ఘనత తెలియుచున్నది.
  2. అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటి ఏమిటంటే, ఆయన ప్రతిఫలం పొందే మార్గాలను సులభతరం చేస్తాడు.
  3. దర్మబద్ధత, నైతికత మరియు మంచితనపు ద్వారాల ద్వారా ప్రతిఫలంలో తమ వాటాను పొందుటలో అల్లాహ్ యొక్క దాసులు భిన్నంగా ఉంటారు.
  4. అల్లాహ్’ను నాలుకతో స్తుతించుట, ప్రశంసించుట, ఆయన ఏకత్వాన్ని ప్రకటించుట, ఆయన ఘనతను కొనియాడుట, మొదలైన ఇతర విషయాలతో పాటు హృదయం కూడా పూర్తిగా అందులో లీనమై ఉండడం అనేది అనేక స్వచ్ఛంద ఆరాధనల స్థానాన్ని ఆక్రమిస్తుంది.
  5. ఈ హదీథులో ప్రశ్నలు వేసే వారి పట్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపే శ్రద్ధ, ప్రతి ఒక్కరికి అతని స్థితికి తగిన విధంగా సమాధానం ఇవ్వడం చూడవచ్చు.

అనువాదాలను వీక్షించండి

56 భాష
EN English ఇంగ్లీషు
UR اردو ఉర్దూ
ES Español స్పానిష్
ID Indonesia ఇండోనేషియన్
BN বাংলা బెంగాలీ
FR Français ఫ్రెంచ్
TR Türkçe టర్కిష్
RU Русский రష్యన్
BS Bosanski బోస్నియన్
SI සිංහල సింహళ
HI हिन्दी హిందీ
ZH 中文 చైనీస్
FA فارسی పర్షియన్
VI Tiếng Việt వియత్నమీస్
TL Tagalog టాగలాగ్
KU Kurdî కుర్దిష్
HA Hausa హౌసా
PT Português పోర్చుగీసు
ML മലയാളം మలయాళం
SW Kiswahili స్వాహిలీ
TA தமிழ் తమిళం
TH ไทย థాయ్
DE Deutsch జర్మన్
PS پښتو పష్టో
AS অসমীয়া అస్సామీ
SQ Shqip అల్బేనియన్
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
GU ગુજરાતી الغوجاراتية
KY Кыргызча Қирғизӣ
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Кинёрвондӣ
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Малагашӣ
OM Oromoo Урумӣ
KN ಕನ್ನಡ Канада
WO Wolof الولوف
AZ Azərbaycan Озарӣ
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو